Home » Telugu News » ఎస్ఐ ఉద్యోగం కోసం గర్భిణి సాహనం.. 400 మీటర్ల పరుగు, షాకైన అధికారులు

ఎస్ఐ ఉద్యోగం కోసం గర్భిణి సాహనం.. 400 మీటర్ల పరుగు, షాకైన అధికారులు

ప్రధానాంశాలు:

  • ఎస్సై ఫిజికల్‌ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన గర్భవతి
  • కర్ణాటకలో వెలుగు చూసిన సంఘటన
  • డాక్టర్లు వద్దని చెప్పినా ధైర్యంగా పరుగు పెట్టిన యువతి

పోలీసు ఉద్యోగం అంటే ఆమెకు చాలా ఇష్టం. దానికోసం ఎన్నాళ్ల నుంచో సాధన చేస్తోంది. వివాహమైన తర్వాత భర్త కూడా ఆమెను ప్రోత్సహించాడు. అయితే మరికొద్ది రోజుల్లో ఫిజికల్ ఈవెంట్ ఉండగా తాను గర్భవతినని తెలిసింది. ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొంటే అబార్షన్ అయ్యే ప్రమాదముందని, ఆ ఆలోచన మానుకోవాలని డాక్టర్లు సూచించారు. అయితే చిన్నప్పటి నుంచి కలలుగన్న పోలీసు ఉద్యోగం ముందు ఇంకేదీ తనకు ముఖ్యం కాదనుకుంది. ధైర్యంగా ఈవెంట్స్‌కి హాజరై అందులో క్వాలిఫై అయింది. పోటీ ముగిసిన తర్వాత గానీ ఆమె గర్భవతి అన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియలేదు. దీంతో ఆమె తెగువను చూసి అందరూ అభినందించారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

Also Read: 330 మందితో డేటింగ్.. టార్గెట్ 365.. వైరల్ అవుతున్న తమిళ నటుడి స్టోరీ

కర్ణాటకలోని కలబురాగికి చెందిన అశ్విని సంతోష్‌ కోరే(24) చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని కలలు కంటూ పెరిగింది. దాని కోసం ఎంతో సాధన చేసేది. అయితే పోలీస్ ఉద్యోగం కావాలంటే రన్నింగ్, జంపింగ్ పోటీలతో పాటు రాత పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గతంలో రెండుసార్లు ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయినప్పటికీ రాత పరీక్షలో తప్పింది. ఈలోగా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేశారు. అశ్విని లక్ష్యాన్ని అర్ధం చేసుకున్న భర్త ఆమె ఎంతగానో ప్రోత్సహించాడు. దీంతో మూడో ప్రయత్నంలో ఎలాగైనా పోలీసు జాబ్ కొట్టాలని తీవ్రంగా సాధన చేస్తోంది.

Also Read: స్టాలిన్ మరో సంచలన నిర్ణయం.. ఒక్క సంతకంతో తండ్రి కల నెరవేర్చుతూ..

ఫిజికల్ ఈవెంట్స్ మరో 10రోజులు ఉండగా ఆమె గర్భవతి అని తెలిసింది. ఏం చేయాలో తెలీక గైనకాలజిస్టును కలిసి తన పరిస్థితి వివరించింది. గర్భవతిగా ఉన్నప్పుడు రన్నింగ్, జంపింగ్ లాంటివి చేయకూడదని, అలా చేస్తే అబార్షన్ అవుతుందని డాక్టర్ హెచ్చరించారు. అయినప్పటికీ ధైర్యం చేసిన అశ్విని పరుగు పందెం పోటీలో పాల్గొంది. 400 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా… కేవలం 1.36 సెకన్లలో టార్గెట్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అశ్విని సాహసం గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆమెను అభినందించారు. ‘అశ్విని గర్భవతి అనే విషయం మాకు తెలియదని, చాలా మంది మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో ఫిజికల్‌ ఈవెంట్స్‌లో పాల్గొనాలంటే భయపడతారని, కానీ అశ్విని ధైర్యం చేసి పాల్గొనడమే కాకుండా క్వాలిఫై కావడం ఆనందంగా ఉందన్నారు. ఈసారి ఆమె రాత పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి పోలీసు ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


Source link

x

Check Also

NBK 107: బాలకృష్ణతో కుదరదు.. ఇద్దరు స్టార్స్ అదే మాట! సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తేనే గ్రేట్ అనుకునే ఈ రోజుల్లో లాంటి బడా స్టార్ సినిమాలో ...