Home » Telugu News » విద్యార్థులకు రూ.75,000 వరకూ స్కాలర్‌షిప్‌లు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

విద్యార్థులకు రూ.75,000 వరకూ స్కాలర్‌షిప్‌లు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

ప్రధానాంశాలు:

  • హెచ్‌డీఎఫ్‌సీ కోవిడ్‌ క్రైసిస్‌ సపోర్ట్‌ స్కాలర్‌షిప్‌
  • విద్యార్థుల చదువుకు స్కాలర్‌షిప్‌ల ప్రకటన
  • కోవిడ్‌ క్రైసిస్‌ సపోర్ట్‌ పేరుతో ఆర్థిక సాయం

కరోనా మహమ్మారి అన్నీ రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా కోలుకోలేని దెబ్బ తీసింది. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి వీధినపడ్డారు. వీళ్ల చదువు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం HDFC బ్యాంక్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. Covid Crisis Support పేరుతో స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రారంభించినట్లు పేర్కొంది.

డిగ్రీతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌.. రూ.36,000 ప్రారంభ జీతం.. పూర్తి వివరాలివే
అర్హతలు:
ఈ స్కాలర్‌షిప్.. పాఠశాల (1 నుంచి 12 తరగతుల వరకు), కాలేజీ (అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా) విద్యార్థుల కోసం రూపొందించింది. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తారు. స్కాలర్‌షిప్ ఫండ్‌ను ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఆన్‌లైన్ లెర్నింగ్ పరికరాలు, పుస్తకాల మొదలైన వాటి కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు.

ఇక అర్హతల విషయానికి వస్తే.. 2020 జనవరి నుండి కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకోవాలి. అయితే.. వారి కుటుంబ వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 6 లక్షలకు మించకూడదు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. ఇక్కడ క్లిక్‌ చేయండి:

IOCL: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 480 జాబ్స్‌.. పూర్తి వివరాలివే
ఇలా దరఖాస్తు చేసుకోవాలి:
HDFC బ్యాంక్ ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తుంది. బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/ లోకి వెళ్లి మీ ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్‌ చేయాలి.

గతేడాది మార్క్ షీట్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, అడ్మిషన్ లెటర్, ఫీజు రిసిప్ట్ లేదా స్కూల్, కాలేజీ ఐడీ కార్డు, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం, ఉద్యోగం కోల్పోయినట్లయితే, తల్లిదండ్రులు మునుపటి ఉపాధికి రుజువు, వారి బ్యాంక్ ఖాతా వివరాలు, కుటుంబం ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పాఠశాల ఉపాధ్యాయుడు, వైద్యుడు మొదలైనవారి నుంచి రిఫరెన్స్ లెటర్ వంటి డాక్యుమెంట్లు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల భర్తీకి SBI జాబ్‌ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే
ఎంపిక ప్రక్రియ:
ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్కు సంబంధించి ఎంపిక ప్రక్రియ అనేక దశల్లో ఉంటుంది. గతేడాది మార్కులు, కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అయితే.. ఈ స్కాలర్షిప్ను ఒకేసారి మంజూరు చేస్తారు. తర్వాతి సంవత్సరాలకు కొనసాగించడం ఉండదు.

పూర్తి వివరాలకు నోటిఫికేషన్‌:

hdfc


Source link

x

Check Also

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య ...