Home » Telugu News » వెంటిలేటర్‌పై అరియానా.. సడెన్ షాక్! స్వయంగా ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

వెంటిలేటర్‌పై అరియానా.. సడెన్ షాక్! స్వయంగా ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

ఏ నిమిషం ఎవ్వరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించడం కష్టం. ఒక్కోసారి కనిపించే కొన్ని దృశ్యాలు సడెన్ షాకిస్తుంటాయి. ఏంటిది నిజామా? అని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. బిగ్ బాస్ బ్యూటీ అరియానా విషయంలో అదే జరిగింది. అలాంటి ఓ దృశ్యాన్ని స్వయంగా షేర్ చేసింది అరియానా. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ అవాక్కయ్యారు. ఇందుకు కారణం ఆమె వెంటిలేటర్ మీద ఉండటం. మరి ఇంతకీ అరియానాకు ఏమైంది? వెంటిలేటర్ మీదకు ఎందుకెళ్లింది? అనేది చూద్దామా..

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అరియానా.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్‌తో ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి బోల్డ్ బ్యూటీగా ఫుల్ పాపులర్ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తోంది. ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ఆమె.. తాజాగా తాను వెంటిలేటర్‌పై ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చింది.
శేఖర్ మాస్టర్ చనిపోయాడు.. గూగుల్ చేసిన పెద్ద పొరపాటు!! షాకవుతున్న ఫ్యాన్స్
అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్ లోనిది అని పూర్తిగా చూశాక అర్థమవుతోంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తోన్న ఓ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తోంది అరియానా. ఇందులోని ఓ సీన్ కోసం ఆమె ఆక్సీజన్ మాస్కుతో వెంటిలేటర్ మీద ఉన్నట్లు నటిస్తోంది. ఆ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోనే ఆరియానా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.


Source link

x

Check Also

సస్పెన్స్ కంటిన్యూ -జెడ్పీటీసీ ఫలితాల వెల్లడిపై వాదనలు పూర్తి : హైకోర్టు తీర్పు రిజర్వ్..!!

ఎన్నికల నిర్వహణలో జరిగింది ఇదీ.. మున్సిపల్ ఎలక్షన్ కు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని కోడ్ అమలు చేయలేదని..మున్సిపల్ ఎన్నికలకు ...