Home » Telugu News » హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థి.. మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు

హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థి.. మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు

ఎలాగైనా హుజూరాబాద్ సీటును దక్కించుకోవాలని అటు బీజేపీ.. అధికార టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించడంతో అన్ని పార్టీల చూపు దళిత ఓట్లపై పడింది. దళితుల ఓటును క్యాష్ చేసుకునేందుకు నేతలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులను వెనక్కి నెట్టేందుకు నేతలు పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికపై తాజాగా మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థి బరిలో ఉండబోతున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్. దళిత ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని.. అందులో భాగంగానే దళిత నాయకుడిని ఎన్నికల బరిలో దింపాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అలాగే మరికొందరు దళిత నేతలను కూడా బరిలో నిలిపితే దళితుల ఓట్లు చీల్చవచ్చని బీజేపీ భ్రమపడుతోందని ఆయన అన్నారు. దళిత బంధుతో అంతా టీఆర్‌ఎస్‌ వైపే నిలవడం జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బీజేపీపై అంత నమ్మకముంటే ఈటల రాజేందర్ మోదీ బొమ్మ కనిపించకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారని హరీశ్ ప్రశ్నించారు. మోదీ ఫొటో చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు గుర్తుకొచ్చి ఓట్లు పడవనే ఉద్దేశంతోనే ఈటల తన ఫొటోను మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని అందరికీ తెలుసన్నారు. బీజేపీకి మళ్లీ ఓటేస్తే వంద దాటిన పెట్రోల్.. ఈసారి 200 రూపాయలు దాటడం ఖాయమని హరీష్ విమర్శించారు.

Also Read: ‘టీఆర్‌ఎస్’ ఎమ్మెల్యేకి షాక్.. ఏ2గా కొడుకు.. సూసైడ్ కేసులో సంచలనం


Source link

x

Check Also

రాసలీలల ఆడియో టేపు… ఖండించిన మంత్రి అవంతి… రాజకీయ ఎదుగుదలనే ఓర్వలేకనే…

Andhra Pradesh oi-Srinivas Mittapalli | Published: Friday, August 20, 2021, 2:10 [IST] మంత్రి అవంతి శ్రీనివాస్ ...