Home » Telugu News » covid vaccine:ఇక విదేశీయులకూ CoWIN ద్వారా భారత్‌లో టీకాలు -WhatsAppలోనే సర్టిఫికెట్‌

covid vaccine:ఇక విదేశీయులకూ CoWIN ద్వారా భారత్‌లో టీకాలు -WhatsAppలోనే సర్టిఫికెట్‌

India

oi-Madhu Kota

|

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యాక్సిన్ పొందినట్లు పౌరులకు ఇచ్చే సర్టిఫికేట్ ను ఇకపై వాట్సాప్ ద్వారా పొందొచ్చన్న కేంద్రం.. భారత్ లో నివసిస్తోన్న విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ లో ఉంటోన్న విదేశీయులు తమ పాస్‌పోర్టులను చూపించి కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతిలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

విదేశీయులకూ భారత్ లో వ్యాక్సిన్లు అందజేస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా సోమవారం వెల్లడించారు. ఈ విధానంలో కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సినేషన్ స్లాట్ అలాట్ అవుతుంది. ఆపై వాళ్లు వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. భారత్ లో భారీ సంఖ్యలో విదేశీయులు నివసిస్తున్నారని, వారికి వ్యాక్సిన్ అందజేయడం చాలా అవసరమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. తద్వారా విదేశీయుల జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది. అంతేకాదు,

now-foreigners-can-get-vaccine-in-india-via-cowin-certificate-on-whatsapp-centre

భారత్ లో నివసిస్తోన్న విదేశీయులు అందరికీ టీకాలు అందిచడం ద్వారా అధిక జనాభా ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని నివారించడం సులభం అవుతుందని, ఆ మేరకు ఈ నిర్ణయం చాలా కీలకమైన అడుగని కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకొని విదేశీయుల వల్ల వైరస్ వ్యాపించకుండా కూడా ఈ నిర్ణయం నియంత్రిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, భారత్‌లో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 9 నాటికి భారత్‌లో 51 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. మరోవైపు,

కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్‌ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా మారింది. కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్‌ పోర్టల్‌ ద్వారా ఈ సర్టిఫికెట్‌ పొందే సదుపాయం ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్‌ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో..

జగన్ అనూహ్యం: బీజేపీని తిడుతూనే బిల్లులకు మద్దతు, విశ్వాసం కోసమే -కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్జగన్ అనూహ్యం: బీజేపీని తిడుతూనే బిల్లులకు మద్దతు, విశ్వాసం కోసమే -కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్

వ్యాక్సిన్ సర్టిఫికేట్లకు సంబంధించి అందుతోన్న ఫిర్యాదులకు అనుగుణంగా, సులభమైన ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆఫీసు పేర్కొంది. టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆ మేరకు సర్టిఫికెట్‌ పొందవచ్చు. మైగవ్‌ కరోనా హెల్ప్‌డెస్క్‌ వాట్సాప్‌ నెంబర్‌ 9013151515ను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవడం ద్వారా సర్టిఫికేట్ పొందొచ్చు. వాట్సాప్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ ప్రశంసిచారు. ఇదిలా ఉంటే,

దేశంలో సోమవారం నాటికి కరోనా వ్యాప్తి కొద్దిమేర తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల్లో.. కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. ఆదివారం 13,71,871 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 35,499 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు 9 శాతం మేర క్షీణించాయి. అందుకు నిర్ధారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. నిన్న మరో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.19 కోట్లకు చేరగా.. 4.28లక్షల మంది మరణించారు.

ప్రస్తుతం భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,188(1.26 శాతం)గా ఉంది. నిన్న 39 వేల మంది కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 3.11 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.40 శాతానికి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన డోసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నిన్న 16,11,590 మంది టీకాలు వేయించుకున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ ఊపందుకుంటున్న దశలోనే డెల్టా తదితర వేరియంట్లు విజృంభిస్తుండటంతో వ్యాక్సిన్ల బలోపేతం దిశగా సైంటిస్టులు కీలక అడుగులు వేస్తున్నారు..

bigg boss గుట్టు రట్టు దిశగా సీబీఐ -సీఎం జగన్ పై వైసీపీలో ఆందోళన -సాయిరెడ్డికి దిమ్మతిరిగేలా RRR కౌంటర్bigg boss గుట్టు రట్టు దిశగా సీబీఐ -సీఎం జగన్ పై వైసీపీలో ఆందోళన -సాయిరెడ్డికి దిమ్మతిరిగేలా RRR కౌంటర్

దేశంలో కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్‌పై మొదటి అధ్యయనం ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ మిశ్రమ మోతాదు కరోనా వైరస్ నుండి మెరుగైన రక్షణను అందిస్తుందని అధ్యయనం చెబుతోంది. ఐసీఎంఆర్ ప్రకారం, అడెనోవైరస్ వెక్టర్ ప్లాట్‌ఫామ్ వ్యాక్సిన్, క్రియారహిత హోల్ వైరస్ వ్యాక్సిన్ మిక్స్ డోస్ తీసుకోవడం సురక్షితం. ఈ రెండు టీకాల వివిధ మోతాదులు ఒకే టీకా యొక్క రెండు మోతాదుల కంటే మెరుగైన రోగనిరోధక శక్తిని ఇస్తాయని అధ్యయనంలో తేలినట్టు వివరించింది. కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ఐసీఎంఆర్ మే-జూన్ మధ్యలో యూపీలో ఈ అధ్యయనం చేసింది. డీజీసీఐ నిపుణుల ప్యానెల్ కోవిషీల్డ్, కోవాక్సిన్ మిశ్రమ మోతాదులను అధ్యయనం చేయాలని సిఫార్సు చేసింది. దీని తరువాత, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో టీకా మిక్స్ ట్రయల్ డోస్ కూడా అనుమతించారు.

English summary

Foreign nationals can now get vaccinated in India, Health Minister Mansukh Mandaviya announced monday on Twitter. The foreign nationals can use their passport as an identity document for the purpose of registration on CoWIN portal. Once they are registered on this portal, they will get a slot for vaccination, a release by the health ministry said.

Story first published: Monday, August 9, 2021, 23:22 [IST]


Source link

x

Check Also

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య ...