Home » Telugu News » Independence Day శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలి.. ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం

Independence Day శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలి.. ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం

దేశంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేసి… వందనం చేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అలాగే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభబాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి సహా పలువురు నేతలను మోదీ స్మరించుకున్నారు. అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా యోధులు, ఒలింపిక్ విజేతలపై ప్రశంసలు కురిపించారు.

స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోంది. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీరజవాన్లకు ప్రణామాలు. కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానం.. కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు, వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు జరిపిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు.

కష్టకాలంలో ప్రజల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారని అభినందనలు కురిపించారు. ‘టోక్యో ఒలింపిక్స్‌లో మమ్మల్ని గర్వపడేలా చేసిన అథ్లెట్లు నేడు మన మధ్య ఉన్నారు.. ఈ రోజు వారి విజయాన్ని ప్రశంసించాలని నేను జాతిని కోరుతున్నాను.. వారు మన హృదయాలను గెలుచుకోవడమే కాకుండా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చారు’ అని అన్నారు.

‘కరోనాపై ఎంతో సహనంతో భారత్ పోరాటం చేస్తోంది.. ఎన్నో సవాళ్లు ఎదురైనా కానీ ప్రతి ప్రాంతంలో అసాధారణ వేగంతో పనిచేశాం.. నేడు భారత్ టీకాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. ఇది మా పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల బలం ఫలితంగా సంభవించింది.. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా సంక్రమణ తక్కువే.. మన జీవనశైలి కట్టుబాట్లు కొంత వరకూ రక్షించాయి.. కోవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది..’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది.. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి అన్నారు.

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలని మోదీ ఆంకాంక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాలని, రెండేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం సమృద్ధి సాధించినా.. నూనె గింజల కొరత ఎదుర్కొటోందని వివరించారు. వచ్చే 25 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని పేర్కొన్నారు.

ఓబీసీల్లో ఎవరుండాలనే అధికారం రాష్ట్రాలకే ఇచ్చామని తెలిపారు. చిట్టచివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి.. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు.


Source link

x

Check Also

NBK 107: బాలకృష్ణతో కుదరదు.. ఇద్దరు స్టార్స్ అదే మాట! సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తేనే గ్రేట్ అనుకునే ఈ రోజుల్లో లాంటి బడా స్టార్ సినిమాలో ...