Home » Telugu News » Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు… ఇంట్లోకి చొరబడి కాల్పులు..

Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు… ఇంట్లోకి చొరబడి కాల్పులు..

India

oi-Srinivas Mittapalli

|

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మంగళవారం(ఆగస్టు 17) ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేంద్రానికి హెచ్చరిక చేసేందుకే ఉగ్రవాదులు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే… కుల్గాం జిల్లా బీజేపీ ఇన్‌చార్జిగా జావీద్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు.మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఉగ్రవాదులు ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు జావీద్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ… అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు,స్థానిక పోలీసులు ఆ ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

 another bjp leader shot dead by terrorists in jammu kashmir

జావీద్ అహ్మద్ హత్యపై బీజేపీ మీడియా సెల్‌ ఇంఛార్జీ మంజూర్‌ అహ్మద్‌ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని… ఇలా తుపాకులతో భయపెట్టాలని చూడటం తగదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఓమర్‌ అబ్దుల్లా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. జావీద్‌ అహ్మద్‌ దార్‌ కుటుంబానికి, ఆయన పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇదే కశ్మీర్‌లో ఈ నెల 9న గులాం రసూల్ అనే ఓ బీజేపీ నేతను,ఆయన భార్యను ఉగ్రవాదులు హత్య చేసిన సంగతి తెలిసిందే.కుల్గాం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా చీఫ్‌గా గులాం రసూల్ ఉన్నారు.తాజా జావీద్ అహ్మద్‌ను ఉగ్రవాదులు హత్య చేయడంతో… బీజేపీ నేతలనే వారు టార్గెట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary

A BJP leader was shot dead by militants on Tuesday (August 17) in Kulgam district of Jammu and Kashmir.It is second such incident in a week.

Story first published: Wednesday, August 18, 2021, 1:54 [IST]
Source link

x

Check Also

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య ...