Home » Telugu News » Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్


అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేజ్ ఎక్కి దుమ్ములేపేశాడు. స్టేజ్ మీద మాట్లాడుతూ.. పూజా హెగ్డే గురించి కామెంట్ చేశాడు. అంతేకాకుండా పూజా హెగ్డే ఇప్పుడు ఎంత బిజీగా ఉందో చెప్పేందుకు కొన్ని సంఘటనలను కూడా వివరించారు. ఆమె డేట్ల కోసం కాదు.. ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

‘గీతా ఆర్ట్స్ బ్యానర్ అక్కినేని హీరోలకు కలిసి వస్తుంది. నాగ చైతన్యకు 100 పర్సెంట్ లవ్ సినిమా హిట్ అయింది. ఇప్పుడు అఖిల్‌కు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా రాబోతోంది. అఖిల్‌ను మొదట చూసినప్పుడు టాలీవుడ్ రణ్ బీర్ కపూర్ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే హృతిక్ రోషన్ అయ్యేలా కనిపిస్తున్నాడు.

ఇక పూజా హెగ్డే ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. మన అందరికీ లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఈవెంట్‌కు కూడా పూజా హెగ్డే వస్తుందా? లేదా? అని అనుమానం వచ్చింది. ఈ రెండు మూడు గంటలు కూడా ఏదైనా సినిమాకు ఇచ్చిందా? అని అనుకున్నాను. అయితే ఇప్పుడు పూజా హెగ్డే అందరితో నటిస్తోంది’ అని అన్నాడు. అలా హీరోలందరి పేర్లు చెబుతూ మధ్యలో పవన్ కళ్యాణ్‌తో కూడా పూజా హెగ్డే నటిస్తోందంటూ చెప్పుకొచ్చాడు. అంటే హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డేను ఫిక్స్ అయినట్టు చెప్పకనే చెప్పేశాడు.


Source link

x

Check Also

రాసలీలల ఆడియో టేపు… ఖండించిన మంత్రి అవంతి… రాజకీయ ఎదుగుదలనే ఓర్వలేకనే…

Andhra Pradesh oi-Srinivas Mittapalli | Published: Friday, August 20, 2021, 2:10 [IST] మంత్రి అవంతి శ్రీనివాస్ ...