Home » Telugu News » TS EAMCET Result 2021: టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

TS EAMCET Result 2021: టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు 2021
  • ఫలితాల విడుదల తేదీ వెల్లడి
  • టీఎస్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 25వ తేదీన తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను వీటి తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 30 నుంచి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

SSC GD 2021: 10వ తరగతితో 25,271 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.69,100 వరకు జీతం
ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ షెడ్యూల్‌ ఇదే:
తెలంగాణలో ఎంసెట్‌ 2021 ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎంసెట్‌) 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలెంగ్‌ ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు.

Schools Reopen: తెలంగాణలో స్కూళ్లు రీఓపెన్‌ ఎప్పుడో తెలుసా..? విద్యాశాఖ ఏం చెప్పిందంటే..

  • ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది.
  • సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
  • సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.
  • సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.
  • కాగా.. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

NEET PG 2021 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 20 వరకు అవకాశం.. పూర్తి వివరాలివే


Source link

x

Check Also

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య ...