Home » Telugu News » TSMS: టీఎస్‌ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాలివే

TSMS: టీఎస్‌ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాలివే

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ఎంఎస్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2021
  • ఆగస్టు 21న ప్రవేశ పరీక్ష నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 7 నుంచి 10వ తరగతుల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఈ మేరకు మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌)కు దరఖాస్తు చేసుకునే గడువును పెంచారు. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Independence Day 2021: కశ్మీరం.. గాంధేయం.. త్రివర్ణం.. మన స్వాతంత్ర్య దినోత్సవం
TS ECET Counselling షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు ఈ షెడ్యూల్ ను ఖరారు చేశారు. పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు మొదటగా ఆగస్టు 24 నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అనంతరం ఆగస్టు 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు విద్యార్థులు https://tsecet.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

విద్యార్థులకు రూ.75,000 వరకూ స్కాలర్‌షిప్‌లు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి
సెప్టెంబర్‌ 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌
సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి ఈసెట్‌ తుది విడత ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 14న ధ్రువపత్రాల పరిశీలన.. 14, 15 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 17న సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 18 నుంచి 20 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్‌ 18న స్పాట్‌ ప్రవేశాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.


Source link

x

Check Also

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య ...