Home » Telugu News » Ujjain భారత్‌లో అమ్మాయిలు సరదా కోసం ఆ సంబంధాలు పెట్టుకోరు.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Ujjain భారత్‌లో అమ్మాయిలు సరదా కోసం ఆ సంబంధాలు పెట్టుకోరు.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రధానాంశాలు:

  • పెళ్లి చేసుకుంటానని యువతితో సంబంధం.
  • మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడు.
  • ఆత్మహత్యాయత్నం చేయడంతో కేసు నమోదు.

భారతదేశంలో అమ్మాయిలు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని.. వివాహం చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప లైంగిక చర్యలకు అంగీకరించరని మధ్యప్రదేశ్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అటువంటి సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఉద్ఘాటించింది. ఉజ్జయినికి చెందిన ఓ యువకుడు.. వివాహం చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

యువతిపై మోజు తీరపోయిందేమో వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. తాను మరో యువతిని పెళ్లి చేసుకుంటానని గత జూన్‌‌లో చెప్పడంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దీంతో ఆ యువకుడిపై పోలీసులు అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ కోసం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌కు దరఖాస్తు చేశాడు. అతడి బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ ధర్మాసనం.. యువకుడి వాదనలను తోసిపుచ్చింది.

ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే తనతో లైంగిక చర్యల్లో పాల్గొందని నిందితుడు చేసిన వాదనతో న్యాయమూర్తి అంగీకరించలేదు. పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో యువతి లైంగిక సంబంధానికి సమ్మతం తెలిపిందని పేర్కొంది. అత్యాచార కేసుల్లో ఎక్కువ భాగం సమ్మతితోనే జరిగిందని నిందితుల అభ్యర్ధిస్తారని, చాలా సందర్భాలలో నిందితుడు కూడా బెనిఫిట్ ఆఫ్ డబుట్ కింద ప్రయోజనాన్ని పొందుతున్నట్లు గమనించానని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ భారత్ సంప్రదాయ సమాజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘కొన్ని మినహాయింపులను వదిలేస్తే.. ఇంకా భారత్ ఆ నాగరికత స్థాయికి దిగజారిపోలేదు.. ఇక్కడ వివాహిత అమ్మాయిలు వారి మతంతో సంబంధం లేకుండా కేవలం సరదా కోసం అబ్బాయిలతో శారీరక కార్యకలాపాలలో పాల్గొనరు.. అయితే, భవిష్యత్‌లో వివాహం హామీలు, వాగ్దానం చేసినప్పుడు సమ్మతిస్తారు.. ఒకవేళ సరదా కోసమే అయితే బాధితురాలి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం జరగదు’ అని పేర్కొంది.

‘శారీరక సంబంధం వల్ల గర్భం దాల్చితే సమాజంలో ఆమె అవమానానికి గురయ్యే ప్రమాదం ఉంది.. మీరు దీనికి బాధితురాలి సమ్మతిని అభ్యర్థించలేరు’ అని న్యాయమూర్తి అన్నారు. అంతేకాదు, ఆత్మహత్యాయత్నం చేసిందంటే మీతో బంధాన్ని ఆమె ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుస్తోంది.. దీనిని మేం సరదగా పరిగణించలేం’ అని స్పష్టం చేశారు.


Source link

x

Check Also

Most Eligible Bachelor : పవన్ కళ్యాణ్‌తో పూజా హెగ్డే!.. దాని కోసం కూడా వెయిట్ చేయాలి.. గుట్టు విప్పిన హరీష్ శంకర్

అఖిల్ అక్కినేని, కాంబోలో రాబోతోన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముఖ్య ...